‘కామన్వెల్త్’కు నీరజ్ క్వాలిఫై
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:58 AM
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు. శుక్రవారం రాత్రి జరిగిన దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో..రెండో రౌండ్‌లో 82.77 మీ. దూరం...
దోహా డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానం
కతార్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు. శుక్రవారం రాత్రి జరిగిన దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో..రెండో రౌండ్‌లో 82.77 మీ. దూరం విసిరిన నీరజ్ కామన్వెల్త్ క్రీడల క్వాలిఫయింగ్ మార్క్ (82.61మీ.)ను అధిగమించాడు. అయితే గత ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీ. దూరం ఈటెను విసిరి సంచలన ప్రదర్శన చేసిన చోప్రా..ఈసారి 85.69 మీ.తో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత సెప్టెంబరులో వరల్డ్ చాంపియన్‌షి్‌ప్స సందర్భంగా వెన్ను గాయానికిలోనై కోలుకున్న నీరజ్ తొలిసారి పోటీల బరిలో దిగాడు. ఇక..దోహా డైమండ్ లీగ్‌లో శ్రీలంకకు చెందిన తాజా సంచలనం రుమేశ్ పథిరగే (88.68 మీ.) విజేతగా నిలిచాడు. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా, 86.38మీ.) రెండో స్థానంలో, కుర్టిస్ థాంప్సన్ (అమెరికా, 85.99మీ.) మూడో స్థానంలో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?
భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!