Share News

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు నీరజ్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:31 AM

భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ (డీఎల్‌) ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. వచ్చేనెల 4, 5తేదీల్లో బ్రస్సెల్స్‌ వేదికగా డీఎల్‌ ఫైనల్స్‌...

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు నీరజ్‌

న్యూఢిల్లీ: భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ (డీఎల్‌) ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. వచ్చేనెల 4, 5తేదీల్లో బ్రస్సెల్స్‌ వేదికగా డీఎల్‌ ఫైనల్స్‌ జరగనుంది. డీఎల్‌ ఫైనల్స్‌లో భాగంగా జావెలిన్‌ త్రోలో ఐదు మీట్‌లు జరగగా.. చోప్రా రెండింటిలోనే పోటీపడ్డాడు. ఈ రెండు ఈవెంట్ల ద్వారా 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న నీరజ్‌.. ఓవరాల్‌గా ఆరో స్థానంతో ఫైనల్స్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఐదు డైమండ్‌ లీగ్‌ మీట్‌ల ద్వారా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆరుగురు జావెలిన్‌ త్రోయర్లు ఫైనల్స్‌లో పోటీపడతారు. నీరజ్‌తో పాటు ఫైనల్స్‌కు అర్హత సాధించిన వారిలో రుమేశ్‌ పథిరగే (శ్రీలంక), అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), కేశోర్న్‌ వాల్కాట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో), కర్టిస్‌ థాంప్సన్‌ (అమెరికా), జూలియస్‌ యెగో (కెన్యా) ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు

Updated Date - Aug 29 , 2026 | 03:31 AM