Share News

కామన్వెల్త్‌ జట్టులో నీరజ్‌ చోప్రా

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:59 AM

ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్‌ జట్టును ప్రకటించారు. జూలై 23 నుంచి ఆగస్టు రెండు వరకు గ్లాస్గో (స్కాట్లాండ్‌)లో ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో...

కామన్వెల్త్‌ జట్టులో నీరజ్‌ చోప్రా

ఫామ్‌ నిరూపించుకుంటేనే అవకాశం

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్‌ జట్టును ప్రకటించారు. జూలై 23 నుంచి ఆగస్టు రెండు వరకు గ్లాస్గో (స్కాట్లాండ్‌)లో ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 32 మందితో కూడిన టీమ్‌ను భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) వెల్లడించగా.. ఇందులో స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను కూడా తాత్కాలికంగా చేర్చారు. గతేడాది వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స తర్వాత నీరజ్‌ వెన్నునొప్పి కారణంగా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం చోప్రా ఫిట్‌గా ఉన్నాడని, రాబోయే పది రోజుల్లో అతను ప్రాక్టీస్‌ ఆరంభించనున్నట్టు ఏఎ్‌ఫఐ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ సుమారివాలా తెలిపాడు. అతను కామన్వెల్త్‌ క్రీడలకు క్వాలిఫై కావాలంటే 82.61మీ. దూరం జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది. ఇతర త్రోయర్లు రోహిత్‌ యాదవ్‌, యష్‌వీర్‌ సింగ్‌ శనివారం భారత అథ్లెటిక్స్‌ సిరీ్‌సలో క్వాలిఫై మార్క్‌ను దాటి బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. చోప్రా మాదిరే ట్రిపుల్‌ జంప్‌ చాంపియన్‌ సెల్వ ప్రభు పేరును కూడా చేర్చగా, వచ్చే నెలలో జరిగే ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షి్‌పలో తను అర్హతా ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. గుర్విందర్‌ (100మీ.), అనిమేశ్‌ కుమార్‌ (200మీ.), శ్రీశంకర్‌ (లాంగ్‌జంప్‌), తజిందర్‌ పాల్‌ (షాట్‌పుట్‌) తదితరులు కామన్వెల్త్‌ క్రీడల బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 05:59 AM