నిమిషాల వ్యవధిలోనే రికార్డులు బద్ధలు
ABN , Publish Date - May 23 , 2026 | 02:43 AM
జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ (ఫెడ్ కప్) సంచలన ప్రదర్శనతో మొదలైంది. శుక్రవారం జరిగిన తొలిరోజు పోటీల్లో...
రాంచీ: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ (ఫెడ్ కప్) సంచలన ప్రదర్శనతో మొదలైంది. శుక్రవారం జరిగిన తొలిరోజు పోటీల్లో పురుషుల 100 మీటర్ల రేసులో నిమిషాల వ్యవధిలోనే రెండు రికార్డులు నమోదయ్యాయి. తొలి సెమీఫైనల్స్ హీట్స్‌లో గుర్విందర్‌వీర్ సింగ్ 10.17 సెకన్లలోనే రేసు ముగించి.. పదినెలల క్రితం 10.18 సెకన్లతో అనిమేశ్ కుజుర్ నెలకొల్పిన జాతీయ రికార్డును బద్ధలు కొట్టాడు. ఆ వెంటనే జరిగిన రెండో సెమీఫైనల్ హీట్స్‌లో గుర్విందర్ రికార్డును అనిమేశ్ తిరగరాయడం విశేషం. తన హీట్స్‌ను అనిమేశ్ కేవలం 10.15 సెకన్లలోనే ముగించి మళ్లీ తనపేరిట సరికొత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో శనివారం ఈ ఇద్దరూ పోటీపడే ఫైనల్ రేసులో ఎలాంటి రికార్డు నమోదవుతుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్