Share News

నహీద్‌ పాంచ్‌ పటాకా

ABN , Publish Date - Apr 21 , 2026 | 07:08 AM

యువ పేసర్‌ నహీద్‌ రాణా (5/32) ఐదు వికెట్లతో, తన్జిద్‌ హసన్‌ (76), నజ్ముల్‌ షంటో (50 రిటైర్డ్‌ హర్ట్‌) హాఫ్‌ సెంచరీలతో...

నహీద్‌ పాంచ్‌ పటాకా

రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ గెలుపు

మీర్పూర్‌ (బంగ్లాదేశ్‌): యువ పేసర్‌ నహీద్‌ రాణా (5/32) ఐదు వికెట్లతో, తన్జిద్‌ హసన్‌ (76), నజ్ముల్‌ షంటో (50 రిటైర్డ్‌ హర్ట్‌) హాఫ్‌ సెంచరీలతో చెలరేగిన వేళ న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్‌ 48.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ నికీ కెల్లీ (83) మినహా మరే బ్యాటరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. షోరిఫుల్‌ ఇస్లామ్‌ రెండు వికెట్లు సాధించాడు. తన్జిద్‌, నజ్ముల్‌ మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో ఛేదనను ఆతిథ్య జట్టు 35.3 ఓవర్లలో 199/4 స్కోరుతో ముగించింది. తౌహిద్‌ హృదయ్‌ (30 నాటౌట్‌) రాణించాడు. జేడన్‌ లెనాక్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 07:08 AM