Share News

ముకేష్‌ జోడీకి రికార్డు పసిడి

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:27 AM

తెలుగు షూటర్‌ నేలవల్లి ముకేష్‌ ప్రపంచకప్‌లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో....

ముకేష్‌ జోడీకి రికార్డు పసిడి

షూటింగ్‌ వరల్డ్‌క్‌ప

గ్రనడా (స్పెయిన్‌): తెలుగు షూటర్‌ నేలవల్లి ముకేష్‌ ప్రపంచకప్‌లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో గుంటూరు షూటర్‌ ముకే్‌ష-పాలక్‌ గులియా (హరియాణా) జోడీ ఫైనల్లో 487.7 స్కోరుతో పసిడి పతకం కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఉజ్బెకిస్థాన్‌ జంట ముఖమ్మద్‌-సైద్కులోవా పేరిట 481.3 పాయింట్లతో ఉన్న ప్రపంచ రికార్డును ముకేష్‌ జోడీ తిరగరాసింది. ఫైనల్లో ముకేష్‌ (244.7 పాయింట్లు), పాలక్‌ (243) ద్వయం అత్యధిక స్కోరు చేసి అగ్రస్థానం దక్కించుకుంది. చైనా జంట యావో క్యాన్జున్‌-హు కాయ్‌కు రజతం, హంగేరి జోడీ మేజర్‌ వేరోనిక-నాగికి కాంస్యం దక్కాయి. సీనియర్‌ విభాగంలో ముకే్‌షకు ఇదే తొలి పతకం. జూనియర్‌ విభాగంలో అతను ఇప్పటిదాకా 22 అంతర్జాతీయ పతకాలను సాధించాడు. బుధవారం వ్యక్తిగత విభాగంలో ముకేష్‌ పోటీ పడనున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 03:27 AM