Share News

సెమీస్‌లో కోస్ట్యుక్‌ ఆండ్రీవా

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:04 AM

రష్యన్‌ బ్యూటీ మిర్రా ఆండ్రీవా, ఉక్రెయిన్‌ భామ మర్టా కోస్ట్యుక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సకు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 8వ సీడ్‌ ఆండ్రీవా...

 సెమీస్‌లో కోస్ట్యుక్‌ ఆండ్రీవా

  • జ్వెరెవ్‌ కూడా..

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: రష్యన్‌ బ్యూటీ మిర్రా ఆండ్రీవా, ఉక్రెయిన్‌ భామ మర్టా కోస్ట్యుక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సకు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 8వ సీడ్‌ ఆండ్రీవా 6-0, 6-3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)ను వరుస సెట్లలో ఓడించింది. ఉక్రెయిన్‌ ప్లేయర్ల మధ్య జరిగిన మరో పోరులో కోస్ట్యుక్‌ 6-3, 2-6, 6-2తో ఏడో సీడ్‌ స్విటోలినాకు షాకిచ్చింది. గురువారం జరిగే సెమీ్‌సలో ఆండ్రీవాతో కోస్ట్యుక్‌ అమీతుమీ తేల్చుకోనుంది. రష్యా-ఉక్రెయిన్‌ ప్లేయర్ల మధ్య మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. కాగా, నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ అరియానా సబలెంక 7-5, 6-3తో నవోమి ఒసాకపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 7-6(3), 6-1, 6-3తో రఫెల్‌ జోడర్‌ (స్పెయిన్‌)పై గెలిచి సెమీ్‌స చేరాడు.

ఇవి కూడా చదవండి:

జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Updated Date - Jun 03 , 2026 | 05:04 AM