ఫైనల్లో మీనాక్షి, జైస్మిస్
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:23 AM
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో ప్రపంచ చాంపియన్లు మీనాక్షి హుడా (48 కిలోలు), జైస్మిన్ లంబోరియా (57 కి)తోపాటు విశ్వనాథ్...
విశ్వనాథ్, సచిన్ కూడా
ఆసియా బాక్సింగ్
ఉలన్‌బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో ప్రపంచ చాంపియన్లు మీనాక్షి హుడా (48 కిలోలు), జైస్మిన్ లంబోరియా (57 కి)తోపాటు విశ్వనాథ్ (50 కి), సచిన్ సివాచ్ (60 కి)లు ఫైనల్‌కు చేరుకొన్నారు. దీంతో స్వర్ణ పోరుకు చేరుకొన్న భారత బాక్సర్ల సంఖ్య 8కి చేరింది. సెమీస్‌లో మీనాక్షి 4-1తో తిప్‌సట్చా (థాయ్‌లాండ్)పై, జైస్మిన్ 3-2తో నిగినా (ఉజ్బెకిస్థాన్)పై, విశ్వనాథ్ 5-0తో హుతైఫా ఎషిష్ (జోర్డాన్)పై, సచిన్ 4-1తో సక్డా రూమాతం (థాయ్)పై గెలిచారు. అయితే, ఆకాష్ (75 కి), లోకేశ్ (85 కి), హర్ష చౌదరి (90 కి), నరేంద్ర బెర్వాల్ (90+ కి) సెమీస్‌లో ఓడి కాంస్యాలకే పరిమితయ్యారు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్