ఎంబప్పే అదిరె..
ABN , Publish Date - Jun 24 , 2026 | 06:02 AM
స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబప్పే డబుల్ గోల్స్‌తో అదరగొట్టడంతో.. టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్ నాకౌట్ రౌండ్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఐలో మంగళవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో ఇరాక్‌ను...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
కొలంబియా X డీఆర్ కాంగో
(ఉదయం 7.30)
స్విట్జర్లాండ్ X కెనడా
( అర్ధరాత్రి 12.30)
కతార్ X బోస్నియా
( అర్ధరాత్రి 12.30)
మొరాకో X హైతీ
(గురువారం తెల్లవారుజాము 3.30)
బ్రెజిల్ X స్కాట్లాండ్
(గురువారం తెల్లవారుజాము 3.30)
నాకౌట్‌కు ఫ్రాన్స్, నార్వే
ఫిలిడెల్ఫియా: స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబప్పే డబుల్ గోల్స్‌తో అదరగొట్టడంతో.. టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్ నాకౌట్ రౌండ్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఐలో మంగళవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో ఇరాక్‌ను చిత్తు చేసింది. ఎంబప్పే (14వ, 54వ నిమిషం), ఔస్మానె డెంబిలి (66వ) ఫ్రాన్స్ తరఫున గోల్స్ చేశారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఫ్రాన్స్ మొత్తం ఆరు పాయింట్లతో రౌండ్-32 బెర్త్‌ను దక్కించుకొంది. హెవీవెయిట్ ఫ్రాన్స్‌కు ఇరాక్ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఎంబప్పే సేన బంతిని ఎక్కువగా తమ నియంత్రణలోనే ఉంచుకొంది. ఈ క్రమంలో 14వ నిమిషంలో డి-బాక్స్ బయట నుంచి ఎంబప్పే కొట్టిన కిక్.. గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ వెళ్లి గోల్‌లో పడింది. అయితే, ఫస్టాఫ్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురవడంతో.. దాదాపు రెండు గంటలకుపైగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సెకండాఫ్ మొదలైన 9వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో డిఫెండర్ జైద్ తహసిన్ పాస్‌ను ఇరాక్ కీపర్ నియంత్రించలేక పోవడంతో.. బంతిని అందుకొన్న డెంబిలి దాన్ని ఎంబప్పేకు అందించాడు. అతడు ఎంతో సునాయాసంగా గోల్‌లోకి పంపి ఫ్రాన్స్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత డెంబిలి మరో గోల్ చేశాడు.
సుదీర్ఘ మ్యాచ్‌గా..
విశ్వక్‌పలో అత్యధిక సమయం దాదాపు 4 గంటలు సాగిన మ్యాచ్‌గా ఫ్రాన్స్-ఇరాక్ పోరు నిలిచింది. ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో 131 నిమిషాలపాటు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో మొత్తం మ్యాచ్ ముగిసేందుకు సుమారు 4 గంటల సమయం తీసుకొంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ సెకండా్‌ఫలో వాటర్ బ్రేక్ ఇవ్వలేదు. టోర్నీలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
మెరిసిన హాలాండ్
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (న్యూజెర్సీ): తురుపుముక్క ఎర్లింగ్ హాలాండ్ పదిహేను నిమిషాల్లో రెండు గోల్స్‌తో చెలరేగడంతో.. నార్వే రౌండ్-32కు చేరుకొంది. గ్రూప్-ఐలో జరిగిన మ్యాచ్‌లో నార్వే 3-2తో సెనెగల్‌పై నెగ్గింది. 43వ నిమిషంలో మార్కస్ పెడర్సన్ గోల్‌తో నార్వే పైచేయి సాధించింది. ఆ తర్వాత 48వ, 58వ నిమిషాల్లో హాలాండ్ గోల్స్ చేసి నార్వేను తిరుగులేని స్థితిలో నిలిపాడు. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (53వ, 90+3వ నిమిషం) రెండు గోల్స్ సాధించాడు.
2
కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఎంబప్పే.. వరల్డ్‌క్‌పలో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా జర్మన్ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ 16 గోల్స్ రికార్డును సమం చేశాడు. మెస్సీ అత్యధికంగా 18 గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి