ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి..
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:41 AM
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్టు ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ వెల్లడించింది....
వెల్లడించిన మేరీ కోమ్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్టు ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ వెల్లడించింది. అమెచ్యూర్ సర్క్యూట్‌లో పోటీపడే వయస్సు కూడా దాటినందున తాను ఆ విషయంపై దృష్టి సారించినట్టు తెలిపింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం, ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం అమెచ్యూర్ బాక్సింగ్ పోటీల బరిలో దిగే గరిష్ఠ వయస్సు 40. ‘వయోపరిమితి కారణంగా దేశం తరపున అమెచ్యూర్ బాక్సింగ్ పోటీలలో తలపడలేను. కానీ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి’ అని 43 ఏళ్ల మేరీకోమ్ ఆదివారం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్