Share News

మనికాకు దక్కని బెర్తు

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:24 AM

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ క్రీడాకారిణి మనికా బాత్రాకు ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కలేదు. జాతీయస్థాయి ఈవెంట్లకు దూరమవడంతో నిబంధనల ప్రకారం ఆమెను ఆసియాడ్‌ జట్టు నుంచి...

మనికాకు  దక్కని బెర్తు

  • తెలుగమ్మాయి శ్రీజకు సారథ్యం

  • ఆసియాడ్‌ టీటీ

న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ క్రీడాకారిణి మనికా బాత్రాకు ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కలేదు. జాతీయస్థాయి ఈవెంట్లకు దూరమవడంతో నిబంధనల ప్రకారం ఆమెను ఆసియాడ్‌ జట్టు నుంచి తప్పించినట్టు భారత టీటీ సమాఖ్య (టీటీఎ్‌ఫఐ) తెలిపింది. మనికా గైర్హాజరీతో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మహిళల టీటీ జట్టుకు సారథ్యం వహించనుంది. మహిళల జట్టు నుంచి శ్రీజ, యశస్విని ఘోర్పడే, దియా చిటాలె, సుతీర్థ ముఖర్జీ, సిండ్రిలా దాస్‌.. పురుషుల బృందంలో సాథియాన్‌, హర్మీత్‌, మానవ్‌ ఠక్కర్‌, మానుష్‌ షా, పరాస్‌ జైన్‌ ఆసియాడ్‌లో తలపడనున్నారు. అయితే ప్రధాన జట్టులో చోటు దక్కకపోయినా, స్వస్తికా ఘోష్‌తో పాటు మనికాను రిజర్వ్‌ ప్లేయర్ల జాబితాలో ఎంపిక చేశారు. ఆసియా క్రీడలు సెప్టెంబరు-అక్టోబరులో జపాన్‌ వేదికగా జరుగనున్నాయి.

ఇవీ చదవండి:

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Updated Date - Jun 19 , 2026 | 05:24 AM