Share News

మానవ్‌-మానుష్‌ జోడీకి ప్రపంచ రెండో ర్యాంక్‌

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:48 AM

భారత టేబుల్‌ టెన్ని్‌సలో నవశకం మొదలైనట్టే కనిపిస్తోంది. ఈ క్రీడలో మనోళ్లు అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్నారనేందుకు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మెరుగుదలే ఇందుకు నిదర్శనం....

మానవ్‌-మానుష్‌ జోడీకి ప్రపంచ రెండో ర్యాంక్‌

  • టాప్‌-10లోకి మరో రెండు జంటలు

  • ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌

న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్ని్‌సలో నవశకం మొదలైనట్టే కనిపిస్తోంది. ఈ క్రీడలో మనోళ్లు అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్నారనేందుకు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మెరుగుదలే ఇందుకు నిదర్శనం. ఐటీటీఎఫ్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ఒకేసారి మూడు జోడీలు టాప్‌-10లో చోటు సంపాదించడం విశేషం. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌ పురుషుల డబుల్స్‌లో మానవ్‌ ఠక్కర్‌-మానుష్‌ షా జోడీ ఏకంగా ప్రపంచ రెండో ర్యాంక్‌ను దక్కించుకొని రికార్డు సృష్టించింది. టీటీ డబుల్స్‌లో భారత్‌ నుంచి ఇప్పటిదాకా ఇదే అత్యుత్తమ ర్యాంక్‌. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దియా చిటాలె-మానుష్‌ షా ద్వయం ఐదో ర్యాంక్‌తో టాప్‌-5లో స్థానం సంపాదించింది. ఇక, మహిళల డబుల్స్‌లో దియా చిటాలె-యశస్విని ఘోర్పడే జంట ప్రపంచ పదో ర్యాంక్‌లో నిలిచింది.

ఈ వార్తలనూ చదవండి:

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం

Updated Date - Jul 15 , 2026 | 05:48 AM