Share News

అతనో ‘సజీవ శిల్పం’

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:11 AM

డీఆర్‌ కాంగో, కొలంబియా మ్యాచ్‌లో.. స్టేడియంలోని స్టాండ్స్‌ వద్ద ఓ ‘శిల్పం’ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, అది విగ్రహం కాదు..

అతనో ‘సజీవ శిల్పం’

డీఆర్‌ కాంగో, కొలంబియా మ్యాచ్‌లో.. స్టేడియంలోని స్టాండ్స్‌ వద్ద ఓ ‘శిల్పం’ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, అది విగ్రహం కాదు.. ఓ అభిమాని అలా నిలుచున్నాడని తెలుసుకొని అంతా ఆశ్చర్యపోయారు. అతడి పేరు మైకేల్‌ ఎన్‌కుకా ఎంబోలాడింగ. ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌లో దివంగత నేత ప్యాట్రిస్‌ లుముంబా తరహాలో ఫోజిస్తూ విగ్రహంగా నిలుచొని ఫేమస్‌ అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎర్రకోటు, పసుపు చొక్కా, బ్లూ ప్యాంట్‌ ధరించిన మైకేల్‌.. డీఆర్‌ కాంగో బెంచ్‌కు వెనుక ఓ దిమ్మెపై కదలకుండా విగ్రహంలా నిలుచున్నాడు. మ్యాచ్‌ సాగినంతసేపు అతడు ఇలాగే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 05:11 AM