లలిత్ రజత పట్టు
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:25 AM
సీనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో భారత కుర్రాడు లలిత్ పతకంతో మెరిశాడు. 55 కిలోల గ్రీకో రోమన్ విభాగంలో రజతం...
సునీల్ కంచు మోత
ఫైనల్‌కు నితేశ్
ఆసియా రెజ్లింగ్
బిష్కెక్ (కిర్గిస్థాన్): సీనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో భారత కుర్రాడు లలిత్ పతకంతో మెరిశాడు. 55 కిలోల గ్రీకో రోమన్ విభాగంలో రజతం సాధించాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో లలిత్ 0-9తో ఇఖ్తియార్(ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక, 87 కిలోల విభాగంలో సునీల్ కుమార్ కాంస్యం నెగ్గాడు. కంచు పతక పోరులో సునీల్ 5-4తో రసులోవ్ (ఉజ్భెకిస్థాన్)పై గెలిచాడు. కాగా, 97 కిలోల విభాగంలో నితేశ్ 7-2తో జెగాంగ్ (చైనా)ను చిత్తుచేసి ఫైనల్ చేరాడు. 77 కిలోల కాంస్య పతక పోరులో అమన్ 14-15తో యెంగున్ నా (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్