ఉప రాష్ట్రపతిని కలిసిన లాక్రాస్ కెప్టెన్ అనుదీప్
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:44 AM
భారత లాక్రాస్ పురుషుల జట్టు కెప్టెన్ అనుదీప్ రెడ్డి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా...
న్యూఢిల్లీ: భారత లాక్రాస్ పురుషుల జట్టు కెప్టెన్ అనుదీప్ రెడ్డి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. తెలంగాణకు చెందిన అనుదీప్ సారథ్యంలో భారత జట్టు ఇటీవల ఆసియా లాక్రాస్ చాంపియన్‌షి్‌పలో చారిత్రక స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఆసియా పోటీలలో పసిడి పతకంతో భారత ఖ్యాతిని అంతర్జాతీయంగా ఇనుమడింపజేసిన అనుదీ్‌పను ఉప రాష్ట్రపతి అభినందించారు. వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే ఆసియా పసిఫిక్ కాంటినెంటర్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లోనూ భారత జట్టు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్