‘క్యాండిడేట్స్’పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:23 AM
ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆడేదీలేనిది ఇంకా నిర్ణయించుకోలేదని కోనేరు హంపి తెలిపింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో సైప్ర్‌సలోని...
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆడేదీలేనిది ఇంకా నిర్ణయించుకోలేదని కోనేరు హంపి తెలిపింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో సైప్ర్‌సలోని బ్రిటిష్ ఎయిర్‌బే్‌సపై కొద్దిరోజుల కిందట డ్రోన్ దాడి జరిగింది. దీంతో.. ఈనెల 28 నుంచి సైప్ర్‌స వేదికగా జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో ఆడేందుకు పలువురు గ్రాండ్‌మాస్టర్లు తటపటాయిస్తున్నారు. ప్రస్తుత యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్టు రెండ్రోజుల క్రితం హంపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె టోర్నీలో ఆడడం లేదంటూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇదే విషయమై స్పందిస్తూ.. తానింకా నిర్ణయం తీసుకోలేదని హంపి పేర్కొంది. మరోవైపు ఈ టోర్నీకి సంబంధించి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయని, యుద్ధ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తెలిపింది.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..