Share News

మూడు రాష్ట్రాల్లో ‘ఫైనల్‌’ సెలవు

ABN , Publish Date - Jul 20 , 2026 | 05:18 AM

కేరళలో ఫుట్‌బాల్‌ క్రేజ్‌ అలా ఇలా ఉండదు. ఈ నేపథ్యంలో అర్జెంటీనా-స్పెయిన్‌ మధ్య జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ను...

మూడు రాష్ట్రాల్లో ‘ఫైనల్‌’ సెలవు

తిరువనంతపురం/ఇంఫాల్‌/షిల్లాంగ్‌: కేరళలో ఫుట్‌బాల్‌ క్రేజ్‌ అలా ఇలా ఉండదు. ఈ నేపథ్యంలో అర్జెంటీనా-స్పెయిన్‌ మధ్య జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకొని కేరళలో సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సాధారణ విద్యా శాఖ పరిథిలోని పాఠశాలలు, ఉన్నత విద్యా శాఖ కిందకు వచ్చే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాలలకు కూడా సెలవు వర్తిస్తుందని కేరళ ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటలో తెలిపింది. అలాగే సాకర్‌ను విపరీతంగా అభిమానించే మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాలలోనూ ఆయా ప్రభుత్వాలు సోమవారం సెలవు ప్రకటించాయి.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 05:18 AM