Share News

షకీరాకు పోటీగా ఐషో స్పీడ్‌ సాంగ్‌

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:02 AM

ఫిఫా వరల్డ్‌కప్‌ ఆరంభానికి ముందు విడుదలయ్యే అధికారిక గీతానికి కూడా ఎంతో క్రేజ్‌ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే కొలంబియన్‌ పాప్‌ సింగర్‌...

షకీరాకు పోటీగా ఐషో స్పీడ్‌ సాంగ్‌

న్యూఢిల్లీ: ఫిఫా వరల్డ్‌కప్‌ ఆరంభానికి ముందు విడుదలయ్యే అధికారిక గీతానికి కూడా ఎంతో క్రేజ్‌ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే కొలంబియన్‌ పాప్‌ సింగర్‌ షకీరా, బర్నా బాయ్‌ ఆలపించిన ‘డాయి డాయి’ పాట మే 15న విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. ఆ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటికి సుమారు 6 కోట్ల వ్యూస్‌ లభించాయి. అయితే దీనికి పోటీగా అన్నట్టు అమెరికన్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఐషో స్పీడ్‌ విడుదల చేసిన ‘చాంపియన్‌’ అనే సాంగ్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. యూట్యూట్‌లో సోమవారం విడుదల చేసిన ఈ సాంగ్‌కు ఒక్క రోజులోనే 50 లక్షల వ్యూస్‌ రావడం విశేషం. షకీరా పాటలో మునుపటి ఆకర్షణ లోపించిందని, దీంతో ఈ పాటనే ఫిఫా అధికారిక గీతంగా చేయాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Updated Date - Jun 03 , 2026 | 05:02 AM