బ్యాంకు ఉద్యోగిగా ఇషాన్
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:00 AM
టీమిండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కాసేపు ఆటకు విరామం ఇచ్చి.. బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు....
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కాసేపు ఆటకు విరామం ఇచ్చి.. బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. వివరాల్లోకెళితే.. స్పోర్ట్స్ కోటా కింద ఇషాన్‌కు గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం అతను అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్నట్టు సమాచారం. ఇక, రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు ఎంపిక కాలేకపోయిన ఇషాన్‌కు నెల దాకా ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు లేవు. దీంతో స్వస్థలంలోనే ఉన్న అతను.. ఆర్బీఐ ఉద్యోగిగా విధులు నిర్వర్తించేందుకు పట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాడు. సాధారణ ఉద్యోగిలా ఐడీ కార్డు ధరించి అక్కడికి వెళ్లిన ఇషాన్‌కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు