Share News

40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:10 AM

గల్ఫ్‌ దేశం ఇరాక్‌ నలభై ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఆ జట్టు ఈ ఏడాది ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఫిఫా కప్‌ క్వాలిఫయింగ్‌ చివరి ప్లేఆఫ్‌ పోరులో ఇరాక్‌ 2-1తో బొలివియాను...

40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు

ఇరాక్‌కు ఫిపా ప్రపంచకప్‌ బెర్త్‌

మెక్సికో: గల్ఫ్‌ దేశం ఇరాక్‌ నలభై ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఆ జట్టు ఈ ఏడాది ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఫిఫా కప్‌ క్వాలిఫయింగ్‌ చివరి ప్లేఆఫ్‌ పోరులో ఇరాక్‌ 2-1తో బొలివియాను ఓడించి మెగా టోర్నీకి బెర్త్‌ దక్కించుకుంది. ఇరాక్‌ తరఫున అలి అల్‌మహది (18వ నిమిషంలో), అయ్‌మెన్‌ హుస్సేన్‌ (53వ) చెరో గోల్‌ చేసి జట్టును గెలిపించారు. బొలివియా జట్టులో ఏకైక గోల్‌ను మోసెస్‌ (38వ) చేశాడు. ఇరాక్‌ జట్టు చివరిగా 1986 వరల్డ్‌కప్‌లో ఆడింది. ఈ ఏడాది జూన్‌ 11 నుంచి కెనడా మెక్సికో, అమెరికా వేదికలుగా జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన ఆఖరి దేశంగా ఇరాక్‌ నిలిచింది. టోర్నీలో మొత్తం 48 జట్లు పోటీపడనున్నాయి. ఆఖరిదైన 48వ స్థానం బెర్త్‌ను ఇరాక్‌ ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్‌, నార్వే, సెనెగల్‌ జట్లతో కలిసి ఇరాక్‌ గ్రూప్‌-1 నుంచి తలపడనుంది. అంతకుముందు జరిగిన మరో క్వాలిఫయింగ్‌ పోరులో కాంగో జట్టు 1-0తో జమైకాను ఓడించి 47వ జట్టుగా వరల్డ్‌కప్‌ బెర్త్‌ను పట్టేసింది.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 03:10 AM