అమెరికా నుంచి వెళ్లగొట్టారు
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:28 AM
ఫిఫా ప్రపంచక్‌పలో లాస్ ఏంజెల్స్ వేదికగా న్యూజిలాండ్, ఇరాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది....
ఇరాన్ జట్టు కోచ్ ఆగ్రహం
ఇంగిల్‌వుడ్ (యూఎస్): ఫిఫా ప్రపంచక్‌పలో లాస్ ఏంజెల్స్ వేదికగా న్యూజిలాండ్, ఇరాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక్కడ మ్యాచ్ ముగియడంతో వెంటనే అమెరికానుంచి వెళ్లిపోమంటూ తమకు ఆదేశాలు వచ్చాయని ఇరాన్ కోచ్ అమీర్ ఘలేనోయి వెల్లడించాడు. ఇలా తమ జట్టును అణచివేతకు గురి చేస్తున్నారని అమీర్ మండిపడ్డాడు. మ్యాచ్ ఆడిన తర్వాత విశ్రాంతి కోసం ఇరాన్ జట్టు కాలిఫోర్నియాలో ఒకరోజు ఉండాలనుకుంది. కానీ, వెంటనే ఆ జట్టు ఆటగాళ్లంతా తమ బేస్ క్యాంప్ అయిన మెక్సికో వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు అందాయని అమీర్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..