చికితకు మరో పతకం ఖరారు
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:12 AM
తెలుగు ఆర్చర్ తానిపర్తి చికిత ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్-1 టోర్నీలో అదరగొడుతోంది. తాజాగా మరో విభాగంలోనూ టైటిల్‌పోరుకు...
ఆసియా కప్ ఆర్చరీ
బ్యాంకాక్ : తెలుగు ఆర్చర్ తానిపర్తి చికిత ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్-1 టోర్నీలో అదరగొడుతోంది. తాజాగా మరో విభాగంలోనూ టైటిల్‌పోరుకు చేరుకుంది. తద్వారా కనీసం రజత పతకాన్ని ఆమె ఖాయం చేసుకుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ కేటగిరీలో చికిత/రజత్ చౌహాన్ ద్వయం ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాప్‌సీడ్‌లుగా చికిత/రజత్ జంటకు మిక్స్‌డ్ క్వార్టర్‌ఫైనల్‌కు నేరుగా ప్రవేశం లభించింది. ఇక..గురువారం జరిగిన సెమీ్‌సలో 157-153 తో నాలుగో సీడ్ కజకిస్థాన్ ద్వయాన్ని చికిత/రజత్ జంట ఓడించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత బృందం ఇప్పటికే ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆమెకు కనీసం రజతం ఇంతకుముందే ఖరారైంది.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..