Share News

అమ్మాయిల క్వార్టర్స్‌ ఆశలు సజీవం

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:22 AM

ప్రతిష్ఠాత్మక ఉబెర్‌ కప్‌లో భారత బ్యాడ్మింటన్‌ మహిళల జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-ఎ తొలి పోరులో...

అమ్మాయిల క్వార్టర్స్‌ ఆశలు సజీవం

ఉబెర్‌క్‌పలో ఉక్రెయిన్‌పై భారత్‌ గెలుపు

హోర్సెన్స్‌ (డెన్మార్క్‌): ప్రతిష్ఠాత్మక ఉబెర్‌ కప్‌లో భారత బ్యాడ్మింటన్‌ మహిళల జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-ఎ తొలి పోరులో ఆతిథ్య డెన్మార్క్‌ చేతిలో ఓడిన మన మహిళల బృందం.. తమ రెండో మ్యాచ్‌లో ఉక్రెయిన్‌ను 4-1తో చిత్తుచేసింది. దీంతో టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌ ఆశలను భారత్‌ సజీవంగా ఉంచుకుంది. ఉక్రెయిన్‌తో పోరులో పీవీ సింధుకు సింగిల్స్‌ నుంచి విశ్రాంతినిచ్చి డబుల్స్‌ ఆడించారు. మూడు సింగిల్స్‌లో భారత యువ కెరటాలు ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవికా సిహాగ్‌ ప్రత్యర్థులను చిత్తుచేయగా.. ఒక డబుల్స్‌లో కవిప్రియ/సిమ్రన్‌ జోడీ ప్రత్యర్థి చేతిలో ఓడింది. రెండో డబుల్స్‌లో సింధు/తనీషా జంట ఉక్రెయిన్‌ ద్వయాన్ని ఓడించడంతో భారత్‌ 4-1 ఆధిక్యంతో పైచేయి సాధించింది. గ్రూప్‌లో తన చివరి పోరును భారత్‌ సోమవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనాతో ఆడనుంది.

ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 27 , 2026 | 02:22 AM