Share News

బ్యాటింగ్‌ మెరుగవ్వాల్సిందే

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:34 AM

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు తమ రెండో గ్రూప్‌ మ్యాచ్‌నకు సిద్ధమైంది. బుధవారం నెదర్లాండ్స్‌తో జట్టు తలపడనుంది. అయితే ఆదివారం దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసినప్పటికీ...

బ్యాటింగ్‌ మెరుగవ్వాల్సిందే

మహిళల టీ20 వరల్డ్‌కప్‌

నేడు నెదర్లాండ్స్‌తో భారత్‌ పోరు

రాత్రి 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

లీడ్స్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు తమ రెండో గ్రూప్‌ మ్యాచ్‌నకు సిద్ధమైంది. బుధవారం నెదర్లాండ్స్‌తో జట్టు తలపడనుంది. అయితే ఆదివారం దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసినప్పటికీ జట్టు బ్యాటింగ్‌ విభాగం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆరంభంలో ఓపెనర్‌ స్మృతి మంధాన, చివర్లో రిచా ఘోష్‌ మాత్రమే ప్రభావం చూపారు. మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించలేదు. మిడిలార్డర్‌లో కీలకంగా భావిస్తున్న భార్తీ ఫుల్మాలీ నిర్లక్ష్యపు షాట్‌తో సింగిల్‌ రన్‌కే వెనుదిరిగింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ, జెమీమా బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. ఎందుకంటే లీగ్‌ దశలో మున్ముందు కఠినమైన మ్యాచ్‌లు ఉండడంతో భారత బ్యాటింగ్‌ తీరు గణనీయంగా మెరుగవ్వాల్సి ఉంది. సెమీ్‌సలో చోటు దక్కించుకోవాలంటే హర్మన్‌ప్రీత్‌ సేన ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి మాత్రం అద్భుత బౌలింగ్‌తో పాక్‌కు చెక్‌ పెట్టారు. వీరిద్దరి ప్రతిభతోనే భారత జట్టు పాక్‌పై చక్కటి విజయం అందుకోగలిగింది. బుధవారం నాటి మ్యాచ్‌లోనూ డచ్‌ ఆటగాళ్ల భరతం పట్టాలని ఎదురుచూస్తున్నారు. ఇక నెదర్లాండ్స్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడింది. ఇలాంటి స్థితిలో తమకన్నా మెరుగైన భారత్‌ను ఏమేరకు నిలువరించగలదో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 17 , 2026 | 03:34 AM