ఇషా బృందానికి స్వర్ణం
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:41 AM
భారత షూటర్లు ఇషా సింగ్, మను బాకర్ ఒలింపిక్ కోటా సాధించడంలో విఫలమైనా.. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మాత్రం స్వర్ణం భారత్ సొంతమైంది...
షూటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్
దోహా: భారత షూటర్లు ఇషా సింగ్, మను బాకర్ ఒలింపిక్ కోటా సాధించడంలో విఫలమైనా.. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మాత్రం స్వర్ణం భారత్ సొంతమైంది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన 25 మీ. పిస్టల్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచిన మను త్రుటిలో కాంస్యంతోపాటు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ బెర్త్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఫైనల్లో తలపడిన ఎనిమిది మంది షూటర్లలో ఇషా అట్టడుగున నిలిచింది. కాగా, కొరియా షూటర్ యాంగ్ జిన్ ప్రపంచ రికార్డు స్కోరు (44 షాట్ల)తో స్వర్ణం సాధించగా.. వియత్నాం ప్లేయర్ ట్రిన్‌తు విన్ష్ రజతం, చైనాకు చెందిన జాంగ్ యూయు కాంస్యం దక్కించుకొన్నారు. పతకాలు సాధించిన ఈ ముగ్గురూ తమ దేశాలకు ఒలింపిక్ బెర్త్‌లను ఖరారు చేశారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఇషా (590 పాయిం ట్లు) మూడో స్థానంలో, బాకర్ (587) ఆరోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించగా.. 10వ స్థానంతో దివ్య సుబ్బరాజు (584) ఎలిమినేట్ అయింది. కాగా, టీమ్ ఈవెంట్‌లో ఇషా, మను, దివ్యల త్రయం మొత్తం 1761 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలిచింది. కొరియా, వియత్నాం రజత, కాంస్య పతకాలు దక్కించుకొన్నాయి. మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్ రౌండ్ తొలి రోజు ప్రగతి దూబే 18వ స్థానంలో, మనీషా కీర్ 41వ స్థానంలో, ఆసియాడ్ చాంపియన్ నీరూ దాండా 69వ స్థానంలో ఉన్నారు. ఫైనల్ చేరాలంటే బుధవారం జరిగే మిగిలిన రౌండ్లలో భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో టాప్-8లో నిలవాల్సి ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!
ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..