Share News

డ్రా చేసుకున్నా సెమీస్‌కు..

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:20 AM

మహిళల హాకీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో...

డ్రా చేసుకున్నా సెమీస్‌కు..

నేడు వేల్స్‌తో భారత్‌ ఢీ

హాకీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మహిళల హాకీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో వేల్స్‌ జట్టుతో భారత్‌ తలపడనుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న భారత్‌.. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా సెమీఫైనల్‌ చేరుతుంది. ఓడితే మాత్రం ఇంటిబాట పట్టక తప్పదు. ప్రస్తుతం భారత్‌ పూల్‌-బిలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండు పూల్స్‌ నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి. ఇక వేల్స్‌తో తలపడిన చివరి ఆరు మ్యాచ్‌ల్లో భారత్‌ ఐదింట్లో గెలవడం విశేషం.

ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 11 , 2026 | 03:20 AM