Share News

రాణించిన శివమ్ దూబె, నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే..

ABN , Publish Date - Feb 18 , 2026 | 08:53 PM

నెదర్లాండ్స్ బౌలర్లు చక్కని బౌలింగ్‌తో ఆరంభంలో కట్టడి చేసినప్పటికీ చివర్లో శివమ్ దూబె చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శివమ్ దూబే (31 బంతుల్లో 66) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది.

రాణించిన శివమ్ దూబె, నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే..
India vs Netherlands T20

నెదర్లాండ్స్ బౌలర్లు చక్కని బౌలింగ్‌తో ఆరంభంలో కట్టడి చేసినప్పటికీ చివర్లో శివమ్ దూబె చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శివమ్ దూబే (31 బంతుల్లో 66) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. నెదర్లాండ్స్ ఎదుట 194 పరుగుల టార్గెట్ ఉంచింది. బాగా నెమ్మదిగా ఉన్న పిచ్‌పై ఈ స్కోరును ఛేజ్ చేయడం నెదర్లాండ్స్‌కు సవాలే (India vs Netherlands T20).


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బౌలర్ ఆర్యన్ దత్ (2/19) ఓపెనర్లు ఇద్దరినీ ఔట్ చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరు అవుటైన తర్వాత దిగిన శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా (30) స్కోరు బోర్డును ముందుకు నడిపించారు (IND vs NED match update).


ముఖ్యంగా శివమ్ దూబె బౌండరీలతో అలరించాడు (cricket live update). ఆరు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది. నెదర్లాండ్స్ ముందు 194 పరుగుల టార్గెట్ ఉంచింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ మూడు వికెట్లు తీశాడు. ఆర్యన్ దత్ రెండు వికెట్లు తీశాడు. క్లైన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. మరి, టీమిండియా బౌలర్లను ఎదుర్కొని నెదర్లాండ్స్ ఈ భారీ స్కోరును ఎలా ఛేదిస్తుందో చూడాలి.


ఇవి కూడా చదవండి..

ఇమ్రాన్‌ హత్యకు కుట్ర.. మమ్మల్ని మొహ్సిన్ బెదిరిస్తున్నారు.. మాజీ ప్రధాని సోదరీమణుల ఆరోపణలు..


మీ దృష్టికి పరీక్ష.. ఈ పార్క్‌లో ఉన్న పక్షిని 27 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 18 , 2026 | 08:53 PM