Share News

భారత్‌కు సవాల్‌

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:40 AM

హాకీ ప్రపంచకప్‌ తొలి పోరులో అలవోకగా నెగ్గిన భారత పురుషుల జట్టుకు అసలుసిసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్‌-డిలో సోమవారం జరిగే మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకరైన..

భారత్‌కు సవాల్‌

సా. 6.30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో

ఇంగ్లండ్‌తో కీలకపోరు నేడు

పురుషుల హాకీ వరల్డ్‌కప్‌

అమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): హాకీ ప్రపంచకప్‌ తొలి పోరులో అలవోకగా నెగ్గిన భారత పురుషుల జట్టుకు అసలుసిసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్‌-డిలో సోమవారం జరిగే మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకరైన ఇంగ్లండ్‌తో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై భారత్‌ 3-1తో నెగ్గగా.. మరోవైపు ఇంగ్లండ్‌ 4-1తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌ టాపర్‌ను తాజా మ్యాచ్‌ ఫలితం నిర్ణయించే అవకాశం ఉండడంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. వేల్స్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ రెండు గోల్స్‌తో మెరిసినా, ఫార్వర్డ్‌ ఆటగాళ్లు అభిషేక్‌, సుఖ్‌జీత్‌ అంతగా ఆకట్టుకోలేక పోయారు. బలమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సమష్టిగా సత్తా చాటకపోతే భారీ మూల్యంచెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక పురుషుల గ్రూప్‌-బిలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో బెల్జియం 3-2తో ఫ్రాన్స్‌పై నెగ్గింది. గ్రూప్‌-సిలో ఆస్ట్రేలియా 3-1తో ఐర్లాండ్‌పై, స్పెయిన్‌ 3-1తో దక్షిణాఫ్రికాపై గెలిచాయి.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియాపై గెలుపు .. స్పందించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌

Updated Date - Aug 17 , 2026 | 05:40 AM