క్వార్టర్‌ఫైనల్లో భారత్
ABN , Publish Date - Apr 28 , 2026 | 02:55 AM
భారత జట్టు థామస్ కప్ ఫైనల్స్ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. సోమవారం జరిగిన గ్రూప్-ఎ పోరులో పురుషుల జట్టు 5-0తో...
థామస్ కప్ ఫైనల్స్
హోర్సెన్స్ (డెన్మార్క్): భారత జట్టు థామస్ కప్ ఫైనల్స్ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. సోమవారం జరిగిన గ్రూప్-ఎ పోరులో పురుషుల జట్టు 5-0తో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మరో పోరులో చైనా 4-1తో కెనడాపై నెగ్గింది. 2022 చాంపియన్స్ భారత్ గ్రూప్ తొలి పోరులో 4-1తో కెనడాపై గెలుపొందిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగే గ్రూప్ ఆఖరి పోరులో భారత్-చైనా తలపడతాయి. ఆ మ్యాచ్ ద్వారా గ్రూప్-ఎ టాపర్ ఎవరో తేలుతుంది. ఇక..ఆస్ట్రేలియాతో పోరులో లక్ష్యసేన్ 21-14, 21-16తో ఇప్రెయిమ్ స్టీఫెన్ సామ్‌పై తొలి సింగిల్స్‌లో నెగ్గి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఆపై ఆయుష్ షెట్టి 21-8, 21-6తో శ్రేయ్ ధాండ్‌పై, సాత్విక్/చిరాగ్ 21-14, 21-16తో రిజ్కీ/జాక్‌పై విజయం సాధించడంతో 3-0తో పోరు భారత్ సొంతమైంది. అనంతరం హెచ్‌ఎ్‌స ప్రణయ్ 21-11, 21-17తో రిషి హోండాపై, రెండో డబుల్స్‌లో హరిహరన్/అర్జున్ 21-12, 21-10తో ఆండిక/ఇప్రెయిమ్‌పై గెలవడంతో భారత్ విజయం సంపూర్ణమైంది.
ఇవి కూడా చదవండి:
అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు
మూడేళ్ల నాటి సెహ్వాగ్ సవాల్.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!