భారత రిలే జట్లకు స్వర్ణాలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:59 AM
భారత పురుషుల 4్ఠ400, మిక్స్‌డ్ 4్ఠ100 జట్లు అంతర్జాతీయ ఆహ్వాన రిలే పోటీల్లో స్వర్ణాలతో అదర గొట్టాయి. ఈ క్రమంలో మే నెలలో బోట్స్‌వానా వేదికగా...
చండీగఢ్: భారత పురుషుల 4్ఠ400, మిక్స్‌డ్ 4్ఠ100 జట్లు అంతర్జాతీయ ఆహ్వాన రిలే పోటీల్లో స్వర్ణాలతో అదర గొట్టాయి. ఈ క్రమంలో మే నెలలో బోట్స్‌వానా వేదికగా జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించే అవకాశాలను మరింత మెరుగుపర్చుకొన్నాయి. శనివారం జరిగిన పురుషుల 4్ఠ400 రిలేలో మను, అమోజ్ జాకబ్, డి. చౌదరి, రాజేష్ రమేశ్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 1.43 సెకన్ల టైమింగ్‌తో పసిడిని పట్టేసింది. మిక్స్‌డ్ 4్ఠ100 రిలేలో భారత-బి జట్టు 42.30 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సొంతం చేసుకోగా.. భారత-ఎ జట్టు 43.44 సెకన్లతో రజతం గెలిచింది.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు