మనోళ్లు అజేయంగా..
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:04 AM
ఐదుసార్లు విజేత భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో అపజయమనేది లేకుండా లీగ్ దశను ముగించింది. ఇప్పటికే...
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కొరియాపై 8-0తో గెలుపు
జలంధర్: ఐదుసార్లు విజేత భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో అపజయమనేది లేకుండా లీగ్ దశను ముగించింది. ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన ఆతిథ్య జట్టు సోమవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8-0తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. లీగ్ దశలో ఐదుకు ఐదు మ్యాచ్‌లు గెలుపొందిన ఆసియా క్రీడల చాంపియన్ భారత్ మొత్తం 15 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. బుధవారం మొహాలీలో జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతోనే భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. రెండో సెమీ్‌సలో జపాన్-మలేసియా ఢీకొంటాయి. ఇక..కొరియాతో పోరులో స్ట్రయికర్ దిల్‌ప్రీత్ సింగ్ (8, 40ని.), జుగ్‌రాజ్ సింగ్ (11ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (15ని.), షీలానంద్ లక్రా (33ని.), సుఖ్‌జీత్ సింగ్ (34ని.), సంజయ్ (36ని.), అంగద్‌బీర్ సింగ్ (60ని.) భారత్‌కు గోల్స్ చేశారు. సోమవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ 2-1తో మలేసియాను ఓడించింది. చైనా, బంగ్లాదేశ్ 1-1తో డ్రా చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!
ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..
అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..