చెస్ ఒలింపియాడ్ జట్టులో హంపి, అర్జున్
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:33 AM
ఫిడే ఒలింపియాడ్‌లో తలపడే భారత పురుషులు, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. మహిళల జట్టులో హంపి, పురుషుల్లో అర్జున్ బరిలోకి దిగుతున్నారు...
న్యూఢిల్లీ: ఫిడే ఒలింపియాడ్‌లో తలపడే భారత పురుషులు, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. మహిళల జట్టులో హంపి, పురుషుల్లో అర్జున్ బరిలోకి దిగుతున్నారు. ఒలింపియాడ్ సెప్టెంబరు 16 నుంచి 27 వరకు ఉజ్బెకిస్థాన్‌లో జరగనుంది. పురుషులు, మహిళల విభాగాలలో భారత్ డిఫెండింగ్ చాంపియన్ అన్న సంగతి తెలిసిందే.
ఓపెన్ జట్టు: గుకేష్, అర్జున్, ప్రజ్ఞానంద, నిహాల్ సరిన్, విదిత్ గుజ్‌రాతీ; మహిళల జట్టు: కోనేరు హంపి, వైశాలీ రమేశ్ బాబు, దివ్యా దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, సావిత్రీ శ్రీ.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్