హాకీ లీగ్‌లో పాక్‌పై భారత్ విజయం
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:29 AM
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత జట్టు 4-3 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. రెండేళ్ల తర్వాత దాయాది జట్లు తలపడగా....
లండన్: ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత జట్టు 4-3 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. రెండేళ్ల తర్వాత దాయాది జట్లు తలపడగా.. ఎనిమిదో నిమిషంలోనే పాక్ బోణీ చేసింది. ఆ తర్వాత భారత్‌కు అభిషేక్ (22), నీలకాంత శర్మ (24), సుఖ్‌జీత్ సింగ్ (40), రాజిందర్ సింగ్ (52) గోల్స్ అందించడంతో 4-1 తేడాతో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ చివరి క్వార్టర్స్‌లో పుంజుకున్న పాక్ మరో రెండు గోల్స్ సాధించడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే చివరి నిమిషాల్లో భారత్ ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌ను విజయంతో ముగించింది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి