Share News

న్యూజిలాండ్‌తో తొలి టీ20.. భారత్ ఘన విజయం

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:00 PM

న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించి ఘన విజయాన్ని అందుకుంది.

న్యూజిలాండ్‌తో తొలి టీ20.. భారత్ ఘన విజయం
Ind Scores a Win in First T20 With NZ

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో భారత్ లీడ్‌లోకి వచ్చింది.

టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. 40 బంతుల్లో 82 పరుగులతో గ్లెన్ ఫిలిప్స్ జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. 45 పరుగులతో ఫిన్ అలెన్ కూడా జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్ బెవోన్ జేకబ్స్ కూడా 31 పరుగులతో రాణించాడు. దీంతో, న్యూజిలాండ్ 225 పరుగులు సాధించింది.


అనంతరం బరిలోకి దిగిన భారత కూడా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అభిషేక్ శర్మ (12 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సంజూ శాంసన్ మరోసారి తన సత్తా చూపించాడు. 33 బంతుల్లో 67 పరుగులతో (8 ఫోర్లు, 4 సిక్సులు) జట్టుకు కీలకంగా మారాడు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 42 పరుగులు) జట్టును విజయతీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కివీ బౌలర్లు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా తట్టుకుని నిలబడ్డ భారత బ్యాటర్లు విజయాన్ని అందుకున్నారు. చివరి ఓవర్లలో మిచెల్ స్టాంట్నర్, మైఖేల్ బ్రేస్ వెల్ కీలక వికెట్ల తీయడంతో ఒకనానొక దశలో భారత్ కష్టాల్లో పడ్డట్టు అనిపించినప్పటికీ మళ్లీ కోలుకుని విజయాన్ని అందుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. సౌథీ రికార్డు బద్దలు

పారా ఆసియా క్రీడలు-2026: శీతల్ జోడీకి స్వర్ణం..

Updated Date - Oct 22 , 2026 | 06:06 PM