Share News

షూటౌట్‌లో భారత్‌ గెలుపు

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:26 AM

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భారత్‌ ఖాతా తెరిచింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ షూటౌట్‌లో 3-1తో గెలిచింది....

షూటౌట్‌లో భారత్‌ గెలుపు

హోబర్ట్‌: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భారత్‌ ఖాతా తెరిచింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ షూటౌట్‌లో 3-1తో గెలిచింది. ఆసీస్‌ తరఫున 49వ నిమిషంలో జెరెమి హేవర్డ్‌, భారత్‌ నుంచి 51వ నిమిషంలో శిలానంద్‌ లక్రా గోల్స్‌ చేశారు. ఆ తర్వాత మరో గోల్‌ నమోదవలేదు. దీంతో నిర్దిష్ట సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలవడంతో షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో భారత్‌ 3 గోల్స్‌ చేసి నెగ్గింది.

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

Updated Date - Feb 26 , 2026 | 05:26 AM