భారత్ బోణీ
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:13 AM
హైదరాబాద్ మొట్టమొదటిసారి ఆతిథ్యమిస్తున్న ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆదివారం సాయంత్రం...
హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్
పోటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి):హైదరాబాద్ మొట్టమొదటిసారి ఆతిథ్యమిస్తున్న ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆదివారం సాయంత్రం జీఎంసీ బాలయోగి స్టేడియంలోని హాకీ మైదానంలో ఈ పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హాకీ మైదానంలోకి వెళ్లి భారత్-ఉరుగ్వే క్రీడాకారిణులతో రేవంత్ కరచాలనం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. హాకీపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులను తీసుకొచ్చి, ఈ మ్యాచ్‌లను చూపించాల్సిందిగా శాట్ ఉన్నతాధికారులను రేవంత్ ఆదేశించారు. ఆధునికీకరించిన హాకీ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. బాణసంచా వెలుగు జిలుగులు, డీజే అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వీసీ-ఎండీ సోనీ బాలదేవి తదితరులు పాల్గొన్నారు.
భారత్ శుభారంభం: ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పూల్-బిలో భారత్ 4-0తో ఉరుగ్వేపై గెలిచి, బోణీ కొట్టింది. 21 నిమిషంలో సునేలిటా టొప్పో గోల్‌తో భారత్ ఖాతాను తెరిచింది. ఆ తర్వాత 40వ నిమిషంలో ఇషిక, 49వ నిమిషంలో లాల్‌రిమ్సియామి, 58వ నిమిషంలో రుతుజ గోల్స్ చేసి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి:
254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్
అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..