Share News

సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్.. భారత క్రీడాకారుల బృందం రెడీ

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:07 PM

సెనెగల్ దేశంలో జరగనున్న సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే భారత అథ్లెట్ల బృందాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది.

సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్.. భారత క్రీడాకారుల బృందం రెడీ
Youth Summer Olympics-2026

ఇంటర్నెట్ డెస్క్: సెనెగల్ దేశంలో జరగనున్న సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే భారత అథ్లెట్ల బృందాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. 11 క్రీడలకు చెందిన మొత్తం 17 మంది అథ్లెట్లను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 మధ్య డకార్‌లో ఈ క్రీడా సంరంభం జరగనుంది. ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న తొలి ఒలింపిక్ కార్యక్రమం కావడంతో ఈ ఈవెంట్ ప్రత్యేకతను సంతరించుకుంది.


17 ఏళ్ల లోపు యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యూత్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. 25 క్రీడలకు చెందిన 2700 యువత క్రీడాకారులతో కూడిన 207 బృందాలు యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఉండే పోటీని యువతకు పరిచయడం చేయడంతో పాటు ఒకరినొకరు చూసి నేర్చుకునేందుకు, విభిన్న సంస్కృతులపై అవగాహన పెంచుకునేందుకు యూత్ ఒలింపిక్స్ ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.


యూత్ ఒలింపిక్స్ సందర్భంగా ఆఫ్రికా దేశాల జాతీయ ఒలింపిక్ కమిటీలతో సహకారం కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ సమ్మర్ యూత్ ఒలింపిక్స్ యువత క్రీడాప్రయాణంలో ఓ కీలకమైలురాయిగా నిలిచిపోనుందని పీటీ ఉష వ్యాఖ్యానించారు. యువ క్రీడాకారులు భారత క్రీడారంగ భవిష్యత్తు అని అన్నారు. వీరిలో కొందరు 2032 బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌ను ప్రతానిథ్యం వహించవచ్చని కూడా చెప్పారు. వారు దేశానికి గర్వకారణంగా నిలుస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ సందర్భంగా అథ్లెట్లు, కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బందికి ఐఓఏ అభినందనలు తెలియజేసింది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బుమ్రా, పంత్ రెడీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే ఛాన్స్!

Updated Date - Oct 26 , 2026 | 08:08 PM