Share News

ఆ రాయితీలు.. అప్పటిదాకా రహస్యంగానే!

ABN , Publish Date - Feb 11 , 2026 | 05:17 AM

భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేందుకు పాకిస్థాన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొన్ని రాయితీలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఆ రాయితీలు..  అప్పటిదాకా రహస్యంగానే!

ఐసీసీ, పాక్‌ బోర్డు మధ్య అవగాహన

న్యూఢిల్లీ: భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేందుకు పాకిస్థాన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొన్ని రాయితీలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ రాయితీలేంటో మాత్రం టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాతనే ప్రకటిస్తారని పాక్‌ క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోబోమని ఐసీసీ ఈపాటికే తెలియజేసింది. అంతేకాకుండా 2028-31 సైకిల్‌లో ఓ ఐసీసీ టోర్నీ (బహుశా అండర్‌-19 వరల్డ్‌కప్‌) ఆతిథ్య హక్కులను కూడా బంగ్లాకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే, బంగ్లా క్రికెట్‌ బోర్డు, ఈ పరిణామాల గురించి తెలిసిన కొందరు వ్యక్తులు నచ్చజెప్పడం వల్లే పాక్‌ తన నిర్ణయాన్ని మార్చుకొందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా సమస్యకు చక్కని పరిష్కారం వెదికిన ఐసీసీకి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కృతజ్ఞతలు తెలిపాడు.

తోక ముడిచింది: ఒమర్‌ అబ్దుల్లా

పాక్‌ భయపడిపోయిందని జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఎద్దేవా చేశారు. మాటపై నిలబడే ధైర్యం లేనప్పుడు.. అనవసర బెదిరింపులకు దిగొద్దని హితవు పలికారు. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి గప్‌చు్‌పగా మ్యాచ్‌ ఆడితే మంచిదని ఒమర్‌ అన్నారు.

టికెట్‌ ధరలకు రెక్కలు..

ఇండో-పాక్‌ మ్యాచ్‌కు అడ్డంకులు తొలగడంతో.. కొలంబో విమాన టికెట్‌ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ముంబై నుంచి కొలంబో రౌండ్‌ ట్రిప్‌ టికెట్‌ ధర అమాంతంగా రూ. 10 వేలు పెరిగి రూ. 60 వేలు అయిందట.

Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 11 , 2026 | 05:17 AM