Share News

‘ఆసియా రిలే’లో నిత్య

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:49 AM

జాతీయ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (ఏఎ్‌ఫఐ) వెల్లడించిన ఆసియా రిలేస్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో పాల్గొనే భారత బృందంలో హైదరాబాద్‌ అమ్మాయి జి.నిత్య చోటు దక్కించుకుంది...

‘ఆసియా రిలే’లో నిత్య

న్యూఢిల్లీ: జాతీయ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (ఏఎ్‌ఫఐ) వెల్లడించిన ఆసియా రిలేస్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో పాల్గొనే భారత బృందంలో హైదరాబాద్‌ అమ్మాయి జి.నిత్య చోటు దక్కించుకుంది. బుధవారం ప్రకటించిన 29 మంది జాబితాలో తమన్నా, స్నేహ, సుధీష్ణ శివాంకర్‌, అభినయతో కలిసి నిత్య 4్ఠ100 రిలేలో బరిలోకి దిగనుంది. చైనాలోని షాంగ్యులో ఈనెల 20, 21వ తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. యువ సంచలనం గురిందర్‌వీర్‌ సింగ్‌ భారత బృందాన్ని నడిపించనున్నాడు. పురుషుల 4్ఠ100లో గురిందర్‌వీర్‌, అనిమేష్‌, సంతోష్‌ రౌడ్‌, ప్రణవ్‌, గణేష్‌, సెంథిల్‌, 4్ఠ400 రిలేలో తీర్థేష్‌, అవినాష్‌, సేతు, నిహాల్‌, సంతోష్‌, రిన్సీ జోసెష్‌, సురజ్‌, మోహిత్‌, శ్రీధర్‌, మహిళల 4్ఠ400లో రష్‌దీప్‌, పూవమ్మ, విజయకుమారి, సలోని, శుభ, గౌరినందన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 01:49 AM