పవర్‌లిఫ్టింగ్‌లో వనీష తీన్‌మార్
ABN , Publish Date - Sep 29 , 2026 | 02:29 AM
ఏడబ్ల్యూపీసీ ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్ యువ పవర్‌లిఫ్టర్ సూరినేని వనీష మూడు స్వర్ణాలు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఏడబ్ల్యూపీసీ ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యువ పవర్‌లిఫ్టర్ సూరినేని వనీష మూడు స్వర్ణాలు సాధించి, సంచలనం సృష్టించింది. యూకేలోని మాంచెస్టర్‌లో జరిగిన ఈ పోటీల్లోని మహిళల 60 కిలోల విభాగంలో ఎస్‌బీడీ (స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లి్‌ఫ్ట)లో వనీష మొత్తంగా 320 కిలోల బరువెత్తి పసిడితో మెరిసింది. డెడ్‌లి్‌ఫ్టలో 150 కిలోల బరువెత్తిన ఆమె ప్రథమ స్థానంలో నిలిచి, స్వర్ణం దక్కించుకుంది. బెంచ్‌ప్రెస్‌లో 40 కి., బరువెత్తి, పసిడి సొంతం చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..