Share News

హైదరాబాద్‌ ఓటమితో ఆరంభం

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:31 AM

హెచ్‌ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ను ఆతిథ్య హైదరాబాద్‌ హీరోస్‌ జట్టు ఓటమితో ఆరంభించింది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన లీగ్‌ తొలి మ్యాచ్‌లో...

హైదరాబాద్‌ ఓటమితో ఆరంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హెచ్‌ఎ్‌సబీసీ రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ను ఆతిథ్య హైదరాబాద్‌ హీరోస్‌ జట్టు ఓటమితో ఆరంభించింది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన లీగ్‌ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ పురుషుల జట్టు 21-28తో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్‌ చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌కు ముందు జరిగిన సంగీత విభావరిలో శ్రుతి హాసన్‌ ఆటాపాటతో అలరించింది. ఆ తర్వాత రాష్ట్ర క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, క్రీడాశాఖ ప్రత్యేక ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ లీగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రగ్బీ అధ్యక్షుడు రాహుల్‌ బోస్‌, జీఎంఆర్‌ సంస్థల అధిపతి కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 17 , 2026 | 03:31 AM