జెనీవాలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:03 AM
ఫిడే వరల్డ్ చాంపియన్‌షి్‌పనకు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదిక కానుంది. నవంబరు 22 నుంచి డిసెంబరు 12 వరకు జరిగే ఈ పోటీలో...
నవంబరు 22 నుంచి మెగా టోర్నమెంట్
న్యూఢిల్లీ: ఫిడే వరల్డ్ చాంపియన్‌షి్‌పనకు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదిక కానుంది. నవంబరు 22 నుంచి డిసెంబరు 12 వరకు జరిగే ఈ పోటీలో డిఫెండింగ్ చాంప్ గుకేష్ దొమ్మరాజును ఉజ్బెకిస్థాన్ జీఎం జవోఖిర్ సిందరోవ్ సవాల్ చేయనున్నాడు. 20 ఏళ్లలోపున్న ఇద్దరు ఆటగాళ్లు ప్రపంచ కిరీటం కోసం తలపడడం ఇదే తొలిసారి. నవంబరు 22న ఆరంభోత్సవం, 24న తొలి రౌండ్ జరగనున్నాయి. 14 రౌండ్ల క్లాసిక్ గేమ్స్‌లో తొలుత 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. ఒకవేళ 14 రౌండ్ల తర్వాత 7-7తో సమమైతే.. టైబ్రేకర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మొత్తం ప్రైజ్‌మనీ సుమారు రూ. 24 కోట్లు కాగా.. ఒక్కో గేమ్ గెలిచినందుకు ఆయా ప్లేయర్‌కు రూ. 1.91 కోట్లు దక్కనున్నాయి.
Also Read:
అక్టోబర్ 3న ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’: సీఎం చంద్రబాబు
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు