Share News

ఐదో స్థానంలో గుకేశ్‌

ABN , Publish Date - May 09 , 2026 | 02:16 AM

గ్రాండ్‌ చెస్‌ సూపర్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నమెంట్‌లో భారత జీఎం గుకేశ్‌ బ్లిట్జ్‌ పోటీల తొలిరోజు మూడు గేమ్‌లు నెగ్గాడు....

ఐదో స్థానంలో గుకేశ్‌

వార్సా (పోలెండ్‌): గ్రాండ్‌ చెస్‌ సూపర్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నమెంట్‌లో భారత జీఎం గుకేశ్‌ బ్లిట్జ్‌ పోటీల తొలిరోజు మూడు గేమ్‌లు నెగ్గాడు. శుక్రవారం జరిగిన బ్లిట్జ్‌ 9 రౌండ్లలో గుకేశ్‌.. 3 విజయాలు, 2 డ్రాలు, 4 ఓటములు నమోదు చేశాడు. దీంతో 4 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక, గురువారంతో ముగిసిన ర్యాపిడ్‌ పోటీల్లో 9 పాయింట్లను అందుకున్న గుకేశ్‌.. బ్లిట్జ్‌లో 4 కలిపి ఓవరాల్‌గా 13 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. హాన్స్‌ నీమనన్‌ (అమెరికా) 16.5 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. బ్లిట్జ్‌లో మరో 9 రౌండ్లు మిగిలున్నాయి.

ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 09 , 2026 | 02:16 AM