Share News

జర్మనీ విజృంభణ

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:53 AM

మాజీ చాంపియన్‌ జర్మనీ.. వరల్డ్‌క్‌పలో అదిరే బోణీ చేసింది. పసికూన కురకావోపై గోల్స్‌ వర్షంతో కురిపించింది. గ్రూప్‌-ఈలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 7-1తో కురకావోపై గెలిచింది...

జర్మనీ విజృంభణ

7-1తో కురకావోపై విజయం

హూస్టన్‌: మాజీ చాంపియన్‌ జర్మనీ.. వరల్డ్‌క్‌పలో అదిరే బోణీ చేసింది. పసికూన కురకావోపై గోల్స్‌ వర్షంతో కురిపించింది. గ్రూప్‌-ఈలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 7-1తో కురకావోపై గెలిచింది. జర్మనీ తరఫున ఫెలిక్స్‌ ఎన్‌మేచా (6వ), నికో ష్కోల్టర్‌బెక్‌ (38వ), కై హావర్ట్‌ (45+5వ, 88వ), జమాల్‌ ముజియాల (47వ), నాథనీల్‌ బ్రౌన్‌ (68వ), డెనిజ్‌ ఉండావ్‌ (78వ) గోల్స్‌ సాధించగా.. కురకావో ప్లేయర్‌ లివానో కమినెన్సియా (21వ) తమ జట్టుకు ఏకైక గోల్‌ అందించాడు. మ్యాచ్‌ ఆసాంతం జర్మనీ ఆధిపత్యమే సాగింది. ఫస్టాఫ్‌ 6వ నిమిషంలో ఫోర్లిన్‌ విట్స్‌తో సమన్వయంతో కదులుతూ ఫెలిక్స్‌ ఎన్‌మేచా.. కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ నేరుగా గోల్‌లోకి కొట్టాడు. అయితే, 21వ నిమిషంలో కురకావో మిడ్‌ఫీల్డర్‌ లివానో కమినెన్సియా గోల్‌ చేసి 1-1తో సమం చేశాడు. కానీ, 38వ నిమిషంలో కార్నర్‌ కిక్‌ను నికో ష్కోల్టర్‌బెక్‌ హెడర్‌తో గోల్‌ చేసి మళ్లీ జర్మనీని 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇక, ఫస్టాప్‌ స్టాపేజ్‌ టైమ్‌లో లభించిన పెనాల్టీని కై హావర్ట్ట్‌ గోల్‌లోకి పంపడంతో.. ఫస్టా్‌ఫను జర్మనీ 3-1తో ముగించింది. ఇక, సెకండాఫ్‌ ఆరంభమైన రెండో నిమిషంలోనే జర్మన్‌ మిడ్‌ఫీల్డర్‌ జమాల్‌ ముజియాల మరో గోల్‌ చేశాడు. 68వ నిమిషంలో నాథనీల్‌ బ్రౌన్‌ బంతిని నెట్‌లోకి పంపాడు. 78వ నిమిషంలో జోషువా కిమిచ్‌ సహకారంతో స్ట్రయికర్‌ డెనిజ్‌ జర్మనీకి ఆరో గోల్‌ అందించగా.. మరో 10 నిమిషాలకు హావర్ట్‌ మరో గోల్‌ సాధించాడు.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 05:53 AM