Share News

అదరగొట్టిన గీతాశ్రీ

ABN , Publish Date - Jun 04 , 2026 | 02:03 AM

మహిళల అండర్‌-18 ఆసియాక్‌పలో భారత జట్టు అదరగొడుతోంది. ఇక్కడ జరిగిన పూల్‌-ఏ లోని తమ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 25-0తో సింగపూర్‌ను చిత్తు చేసింది....

అదరగొట్టిన గీతాశ్రీ

అండర్‌-18 హాకీ ఆసియాకప్‌

  • ఐదు గోల్స్‌తో ఆకట్టుకున్న తెలుగమ్మాయి

  • 25-0తో సింగపూర్‌పై భారత్‌ గెలుపు

కాకామిగహారా (జపాన్‌): మహిళల అండర్‌-18 ఆసియాక్‌పలో భారత జట్టు అదరగొడుతోంది. ఇక్కడ జరిగిన పూల్‌-ఏ లోని తమ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 25-0తో సింగపూర్‌ను చిత్తు చేసింది. ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్‌.. ఈ విజయంతో పూల్‌ దశను భారత్‌ ఓటమి లేకుండా ముగించింది. తెలుగుతేజం, పాయకరావుపేటకు చెందిన మిడ్‌ఫీల్డర్‌ నమ్మి గీతాశ్రీ ఐదు గోల్స్‌ (13వ, 28వ, 47వ, 48వ, 60వ నిమిషాల్లో)తో విజృంభించింది. అంతేకాదు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డునూ దక్కించుకుంది. ఇతర క్రీడాకారిణుల్లో నౌషీన్‌ ఏడు, స్విటీ నాలుగు, ప్రియాంక హ్యాట్రిక్‌ గోల్స్‌తో భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, పూల్‌ దశలో మలేసియా, కొరియా, సింగపూర్‌పై నెగ్గిన భారత్‌ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం పూల్‌-బి మ్యాచ్‌లు ముగిశాక భారత్‌ సెమీఫైనల్‌ ప్రత్యర్థి ఖరారు కానుంది.

సెమీస్‌కు పురుషుల జట్టు: జపాన్‌లో జరుగుతున్న పురుషుల అండర్‌-18 ఆసియాకప్‌లోనూ భారత్‌ సత్తా చాటుతోంది. బుధవారం జరిగిన పూల్‌-ఎ ఆఖరి పోరులో భారత్‌ 13-1తో చైనీస్‌ తైపీని ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 02:03 AM