ఐఓఏ అధ్యక్ష రేసులో నారంగ్
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:35 AM
ఒలింపిక్ పతక విజేత, మాజీ షూటర్ గగన్ నారంగ్, జాతీయ ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా, ఆర్చరీ సంఘం కార్యదర్శి...
న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, మాజీ షూటర్ గగన్ నారంగ్, జాతీయ ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా, ఆర్చరీ సంఘం కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవ్ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి నామినేషన్లు వేశారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. కాగా, ఈ ముగ్గురు నామినేషన్లు వేసినా పోటీ మాత్రం గగన్, రాజీవ్ మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఐఓఏ ప్రస్తుత అధ్యక్షురాలు పీటీ ఉష ఆఖరి నిమిషంలో అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకొంది. మహిళా ఉపాధ్యక్ష పదవికి మాజీ లాంగ్‌జంపర్ అంజు బాబీ జార్జ్, ఈసీ సభ్యుడిగా మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్ నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల 5న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!