Share News

సబలెంకకు డయానా షాక్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 02:01 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. తాజాగా టాప్‌ సీడ్‌ అరియానా సబలెంక ఇంటిముఖం పట్టగా.. పోలెండ్‌కు చెందిన క్వాలిఫయర్‌ మాయా ఖాలీన్‌స్కా..

సబలెంకకు డయానా షాక్‌

  • క్వార్టర్స్‌లోనే టాప్‌ సీడ్‌ అవుట్‌

  • సెమీ్‌సలో క్వాలిఫయర్‌ ఖాలీన్‌స్కా, మెన్సిక్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. తాజాగా టాప్‌ సీడ్‌ అరియానా సబలెంక ఇంటిముఖం పట్టగా.. పోలెండ్‌కు చెందిన క్వాలిఫయర్‌ మాయా ఖాలీన్‌స్కా అనూహ్య రీతిలో సెమీ్‌సకు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్స్‌లో గతేడాది రన్నరప్‌ సబలెంక 6-3, 5-7, 0-6తో 25వ సీడ్‌ డయానా ష్నైడర్‌ (రష్యా) చేతిలో చిత్తయింది. ఇక, ఖాలీన్‌స్కా 7-6(3), 6-3తో 22వ సీడ్‌ అన్నా కలిన్‌స్కయా (రష్యా)ను చిత్తుచేసి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరింది. గురువారం జరిగే సెమీ్‌సలో ష్నైడర్‌తో ఖాలీన్‌స్కా తలపడనుంది. పురుషుల క్వార్టర్స్‌లో 26వ సీడ్‌ మెన్సిక్‌ (చెక్‌) 6-4, 6-3, 7-6(3)తో బ్రెజిల్‌ సంచలనం జోవో ఫోన్సెకా జోరుకు చెక్‌ పెట్టాడు. సెమీ్‌సలో రెండోసీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో మెన్సిక్‌ పోటీపడనున్నాడు. డబుల్స్‌ క్వార్టర్స్‌లో భారత ఆటగాడు శ్రీరామ్‌ బాలాజీ-మార్సెల్లో డిమోలైనర్‌ (బ్రెజిల్‌) జంట 3-6, 4-6తో హెన్రీ-హీలియోవోరా చేతిలో పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 02:01 AM