Share News

వాలీబాల్‌ సమాఖ్య గుర్తింపు రద్దు

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:46 AM

అంతర్గత కలహాలు, ఆర్ధిక ఇబ్బందులు, రాజకీయ జోక్యాల వంటి కారణాలతో సతమతమవుతోన్న భారత వాలీబాల్‌ సమాఖ్య (ఐవీఎ్‌ఫ)కు మరోసారి షాకిచ్చింది...

వాలీబాల్‌ సమాఖ్య గుర్తింపు రద్దు

న్యూఢిల్లీ: అంతర్గత కలహాలు, ఆర్ధిక ఇబ్బందులు, రాజకీయ జోక్యాల వంటి కారణాలతో సతమతమవుతోన్న భారత వాలీబాల్‌ సమాఖ్య (ఐవీఎ్‌ఫ)కు మరోసారి షాకిచ్చింది అంతర్జాతీయ వాలీబాల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ). గతనెలలో ఇచ్చిన 8 నెలల తాత్కాలిక గుర్తింపును కూడా రద్దు చేస్తున్నట్టు ఎఫ్‌ఐవీబీ మంగళవారం ప్రకటించింది. ఆటగాళ్ల ఎంపికలో రాజకీయాలు, సరైన శిక్షణా వసతులు కల్పించలేకపోవడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్‌ఐవీబీ తెలిపింది. అసమర్ధులైన కోచ్‌ల వద్ధ తాము ఉండలేమంటూ మూడ్రోజుల క్రితం జాతీయ జట్టులోని ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లు అహ్మదాబాద్‌లోని శిక్షణ శిబిరం నుంచి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 22 , 2026 | 02:46 AM