ఫిఫా క్‌పపై పాటలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:49 AM
కాలికట్‌లోని మలబార్ క్రిస్టియన్ కళాశాల హిస్టరీ మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వశిష్ట్ ఫిఫా వరల్డ్‌క్‌పపై మూడు ప్రత్యేక పాటలు...
తిరువనంతపురం: కాలికట్‌లోని మలబార్ క్రిస్టియన్ కళాశాల హిస్టరీ మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వశిష్ట్ ఫిఫా వరల్డ్‌క్‌పపై మూడు ప్రత్యేక పాటలు రూపొందించారు. వశిష్ట్ తన విద్యార్థులతో కలిసి సాకర్ ప్రపంచకప్‌పై, దిగ్గజ ఫుట్‌బాలర్లు డీగో మారడోనా, లియోనెల్ మెస్సీపై ఈ పాటలు స్వరపర్చారు. ఫిఫా మ్యాగ్‌జైన్‌లో వశిష్ట్ రాసిన కవిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన ‘ఎ గేమ్ సో కాల్డ్ ఫుట్‌బాల్’ పాటను సాయి గంగాధర్ ఆలపించారు. కాగా ప్రపంచ శాంతికి ఫుట్‌బాల్ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఈ పాటలను రూపొందించినట్టు వశిష్ట్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే