ఇరాన్ ఫ్యాన్స్‌కు టిక్కెట్ల నిరాకరణ
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:50 AM
వరల్డ్‌కప్ ముందు ఇరాన్ అభిమానులకు ఫిఫా షాకిచ్చింది. తమకు కేటాయించిన టిక్కెట్ల కోటాను ఉపసంహరించుకొన్నారని...
టిజువానా (మెక్సికో): వరల్డ్‌కప్ ముందు ఇరాన్ అభిమానులకు ఫిఫా షాకిచ్చింది. తమకు కేటాయించిన టిక్కెట్ల కోటాను ఉపసంహరించుకొన్నారని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ఆరోపించింది. నిర్వాహకులు తీసుకొన్న చర్యల కారణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకొన్న వేలాది మంది అభిమానులు స్టేడియాల బయటే వేచిచూడాల్సిన దుస్థితి నెలకొందని వాపోయింది. విశ్వక్‌పలో ఆడే జట్ల సమాఖ్యలు.. స్టేడియం కెపాసిటీలో 8శాతం టిక్కెట్లు ఉచితంగా పొందే అవకాశం ఉంది. వీటిని వారు తమ ఫ్యాన్స్‌కు పంపిణీ చేస్తారు. కానీ, వారి కోటాను ఉపసంహరించుకోవడంతో ఇరాన్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకొన్న ఆ జట్టు ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవనుంది.
ఇవి కూడా చదవండి:
ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?
ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!